గుర్లలో 'రైతన్న మీకోసం' వారోత్సవాలు
VZM: గుర్ల మండలం చింతలపేట, గరికవలస గ్రామాలలో రైతు సేవ కేంద్రం పరిధిలో నిర్వహించిన 'రైతన్న మీకోసం' వారోత్సవాల కార్యక్రమంలో ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా రైతుల ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, రైతులు పాల్గొన్నారు.