973+.. మళ్లీ కోహ్లీకే సాధ్యం: జితేష్
IPL 2016లో 973 రన్స్ చేసిన కోహ్లీ.. ఓ సీజన్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా అగ్రస్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ రికార్డును బ్రేక్ చేయడం మళ్లీ కోహ్లీకే సాధ్యమని RCB ప్లేయర్ జితేష్ శర్మ పేర్కొన్నాడు. ఈ టోర్నీలోనే అది జరగొచ్చని, లాస్ట్ సీజన్ కంటే చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నాడని జితేష్ చెప్పుకొచ్చాడు. ఈ సీజన్ ఆరెంజ్ కప్ కూడా కోహ్లీదేనన్నాడు.