రోడ్డు ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి

రోడ్డు ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి

KRNL: కర్నూలు జిల్లా పత్తికొండలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై మంత్రి టీజీ భరత్ స్పందించారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన.. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు చనిపోవడం ఎంతో బాధ కలిగించిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు.