అంగన్వాడి కార్యకర్తలకు 5G ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
W.G: ఉంగుటూరు నియోజకవర్గంలో అంగన్వాడి కార్యకర్తలు మెరుగైన సేవలు అందించేందుకు 5G మొబైల్ ఫోన్లను ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు చేతుల మీదుగా అందజేశారు. గతంలో ఇచ్చిన 4G ఫోన్లు సరిగా పనిచేయకపోవడంతో, ఈ ఫోన్లను ప్రభుత్వం పంపిణీ చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. మినీ అంగన్వాడిలను మెయిన్ అంగన్వాడిలుగా అప్‌గ్రేడ్ చేసి, ప్రతి కేంద్రానికి మౌలిక వసతులు మెరుగుపరుస్తామని ఆయన పేర్కొన్నారు.