డీజిల్ దొంగల ముఠా అరెస్టు
W.G: జంగారెడ్డిగూడెంలో జాతీయ రహదారులపై వాహనాల్లో డీజిల్ దొంగిలిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా PLD జిల్లాకు చెందిన స్వామినాయక్, బాలకృష్ణ నాయక్, శ్రీను నాయక్ కలిసి లారీ నుంచి డీజిల్ దొంగిలించి డ్రైవర్‌ను చాకుతో బెదిరించి పరారయ్యారు. రామచర్లగూడెం చెక్‌పోస్ట్ వద్ద వాహన తనిఖీల్లో పోలీసులను చూసి పారిపోవడంతో ముగ్గురిని పట్టుకున్నారు.