రోడ్డు పనులు చేపట్టాలని సీపీఐ ఆందోళన

రోడ్డు పనులు చేపట్టాలని సీపీఐ ఆందోళన

కర్నూలు: పెద్దకడబూరు-ఆదోని ప్రధాన రహదారి పనులను తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో బుధవారం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఆందోళన నిర్వహించారు. సీపీఐ మండల కార్యదర్శి వీరేష్ మాట్లాడుతూ.. బైచిగేరి అడ్డు రోడ్డు వరకు రహదారి అస్తవ్యస్తంగా ఉందన్నారు. నిధులు వచ్చాయని చెబుతున్న అధికారులు వెంటనే పనులు మొదలు పెట్టాలని వారు కోరారు.