మన్యం బంద్‌కు అరకు ఎంపీ సంఘీభావం

ASR: మన్యం బంద్‌కు పాడేరులో అరకు ఎంపీ డాక్టర్ తనుజారాణి సంఘీభావం తెలిపారు. గిరిజన ఆదివాసీ స్పెషల్ డీఎస్సీ ప్రకటించాలంటూ ఆ సంఘ నేతలతో కలిసి ఉద్యమంలో పాల్గొన్నారు. ప్రత్యేక డీఎస్సీ నిర్వహించాలని, జీవో నం-3ని పునరుద్ధరించాలని నినాదాలు చేశారు. అలాగే పాడేరు, తలారిసింగి వద్ద గిరిజన సంఘం సభ్యులు ప్రైవేట్ వాహనాలు, ఆర్టీసీ బస్సును అడ్డగించారు.