నూతన రేషన్ కార్డులు పంపిణీ

WNP: వీపనగండ్ల మండలం కల్వరాలలో నూతన రేషన్ కార్డులను ఆదివారం 42 మంది లబ్ధిదారులకు కాంగ్రెస్ నేతలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా పర్యాటకశాఖ అధికారి నరసింహ మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క నూతన రేషన్ కార్డు మంజూరు కాలేదని విమర్శించారు. ప్రజా ప్రభుత్వంలో సీఎం, మంత్రి జూపల్లి కృష్ణారావు నియోజకవర్గాన్ని సంక్షేమం, అభివృద్ధి వైపు నడిపిస్తున్నారని కొనియాడారు.