నగరంలో నత్తనడక...!

HYD: నల్లాలకు మోటార్లు ఉండకూడదనే ఉద్దేశంతో జలమండలి అధికారులు ప్రారంభించిన మోటార్ ఫ్రీ టాప్ వాటర్ డ్రైవ్ నగరంలో నత్తనడకన సాగుతోంది. మొదటి 4, 5 రోజులు సీరియస్‌గా పనిచేసిన సిబ్బంది ఇప్పుడు నామమాత్రంగా తిరుగుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నేరెడ్‌మెట్, ఆర్కేపురం, తార్నాక, మల్కాజిగిరి, జీడిమెట్ల తదితర ప్రాంతాల్లో ఇంకా మొదలే కాలేదని తెలుస్తోంది.