చిలకవారిపల్లిలో అగ్నిప్రమాదం

చిలకవారిపల్లిలో అగ్నిప్రమాదం

CTR: పుంగనూరు రూరల్ చిలకవారిపల్లిలో గురువారం అగ్నిప్రమాదం జరిగింది. గ్రామంలోని రమణప్పకు చెందిన వరిగడ్డి వాముకు ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుంది. గమనించిన స్థానికులు పుంగనూరు అగ్నిమాపక కార్యాలయానికి సమాచారం అందించారు. అగ్నిమాపక శాఖ సీనియర్ లీడింగ్ ఫైర్ మాన్ సుబ్రమణ్యం ఆధ్వర్యంలో సిబ్బంది అక్కడికి చేరుకుని, మంటలు విస్తరించకుండా అదుపు చేశారు.