VIDEO: చందూర్‌లో ఘనంగా కుస్తీ పోటీలు
NZB: హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని చందూర్ మండల కేంద్రంలో ఆదివారం రాత్రి కుస్తీ పోటీలను ఘనంగా నిర్వహించారు. కుస్తీ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. సర్పంచ్ మద్దూరి మాధవరెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఏటా కామదహనం నాడు కుస్తీ పోటీలు నిర్వహించడం ఆనవాయతీగా వస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో వీడీసీ ఛైర్మన్ శంకర్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు