దట్టమైన పొగమంచు.. వాహనదారుల ఇబ్బందులు
కర్నూలు, నంద్యాల జిల్లాల్లో చలి తీవ్రత పెరిగింది. పలుచోట్ల 16-18°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మహానంది మండల పరిధిలో సోమవారం తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఈ మంచు ప్రభావంతో వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు. ప్రకృతి ప్రేమికులు ఈ మంచు సోయగాలకు పరవశించిపోతున్నారు. పలుచోట్ల చలిమంటలు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు.