డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన అధ్యక్షుడు
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా తూంకుంట మున్సిపల్ పరిధిలోని శామీర్‌పేట్‌లో రూ. 55.50 లక్షల వ్యయంతో చేపట్టనున్న అండర్ డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి పనులకు శనివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వజ్రేష్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెరుగుతున్న జనాభా దృష్ట్యా ఈ డ్రైనేజీ వ్యవస్థ అత్యవసరమని, మున్సిపల్ నిధులతో పనులను వేగంగా పూర్తి చేస్తామన్నారు.