ఎన్నికల నోటిఫికేషన్ వెనక్కి తీసుకోవాలి: MLC
JN: స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ వెనక్కి తీసుకోవాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ చీఫ్, MLC తీన్మార్ మల్లన్న డిమాండ్ చేశారు. మంగళవారం పాలకుర్తి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసిందని, కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలను మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.