బషీర్‌బాగ్ ఈడీ కార్యాలయానికి విజయ్ దేవరకొండ

బషీర్‌బాగ్ ఈడీ కార్యాలయానికి విజయ్ దేవరకొండ

HYD: బెట్టింగ్ యాప్స్ ప్రచారం కేసులో నటుడు విజయ్ దేవరకొండ నేడు బషీర్‌బాగ్ ఈడీ విచారణకు హాజరుకానున్నారు. ఈ కేసులో ఈడీ అధికారులు ఇప్పటికే నటుడు ప్రకాశ్‌రాజ్‌ను విచారించగా.. మళ్లీ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయనని ఆయన వెల్లడించిన విషయం తెలిసిందే. మరోవైపు రానాకు ఆగస్టు 11న, మంచు లక్ష్మి ఆగస్టు 13న విచారణకు రావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది.