టీడీపీ శంఖారావం సభ

విశాఖ: మాకవరపాలెం మండలం ముషిడిపాలెం పంచాయతీ బుచ్చన్నపాలెంలో టీడీపీ ఎన్నికల శంఖారావం సభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు సతీమణి చింతకాయల పద్మావతి గారు హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా దివంగత టీడీపీ నాయకుడు రుత్తల వెంకట రమణ గారి అకాల మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.