భారీ వర్షం.. ఆందోళనలో రైతులు
NZB: ఎడపల్లి మండలంలోని బాపునగర్, ధర్మారం, ఠాణాకలాన్ గ్రామాలలో ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షం వల్ల కొనుగోలు కేంద్రాలు, ప్రైవేటు వెంచర్లలో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. ఈ నేపథ్యంలో, తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సంఘటనతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.