ఘట్కేసర్ వైపు మెట్రో విస్తరించాలని డిమాండ్..!

ఘట్కేసర్ వైపు మెట్రో విస్తరించాలని డిమాండ్..!

మేడ్చల్: ఉప్పల్ నుంచి ఘట్కేసర్ వెళ్లే మార్గంలో రోజురోజుకు ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రోను ఘట్కేసర్ వైపుకు విస్తరించాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ నగరానికి తూర్పున వరంగల్ హైవే వైపు అభివృద్ధి మరింత ముందుకు వెళ్లాలంటే మెట్రోతో పాటు, పరిశ్రమల ఏర్పాటు జరగాలని పలువురు నుంచి డిమాండ్ వ్యక్తం అవుతుంది.