నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన తహశీల్దార్
NDL: కొలిమిగుండ్ల సమీపంలో అల్ట్రాటెక్ పరిశ్రమ చర్యల వల్ల నష్టపోయిన పంట పొలాలను తహసీల్దార్ శ్రీనివాసులు మంగళవారం పరిశీలించారు. పెట్నికోట వద్ద వాగుకు అడ్డంగా గ్రావెల్ వేయడంతో వర్షాకాలంలో పొలాలు నీటమునిగాయని రైతులు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై రైతులు అధికారులకు ఫిర్యాదు చేయడంతో శ్రీనివాసులు పరిశీలించి రైతులతో మాట్లాడారు.