ముత్తోజిపేట 2వ డివిజన్‌లో బీఆర్‌ఎస్ ముందస్తు ప్రచారం
WGL: నర్సంపేట ముత్తోజిపేట 2వ డివిజన్‌లో బీఆర్‌ఎస్ పార్టీ ముందస్తు ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ ఇంఛార్జ్ ఊడుగుల ప్రవీణ్ గౌడ్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధి పనులను ప్రజలకు గుర్తు చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు.