పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్
MDK:పెద్దశంకరంపేట పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ నిర్వహించారు. పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం పురస్కరించుకొని గురువారం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఓపెన్ హౌస్ నిర్వహించి విద్యార్థులకు అవగాహన చేపట్టారు. పోలీసుల విధులు, ఎస్ఐఆర్ నమోదు, ప్రజల భద్రత, తుపాకులపై అవగాహన కల్పించారు. ఏఎస్ఐ చంద్రమోహన్ సిబ్బంది పాల్గొన్నారు.