ఏప్రిల్ 19న నంద్యాలకు సీఎం రాక

NDL: సీఎం చంద్రబాబు వచ్చే నెల 19న నంద్యాలకు రానున్నారు. హరిజనవాడ సమీపంలోని కంపోస్ట్ యార్డులో క్లీన్ అండ్ గ్రీన్‌తో పాటు అక్కడే సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో నంద్యాలకు తొలిసారి వస్తున్నారని టీడీపీ నంద్యాల పట్టణ అధ్యక్షుడు మనియార్ ఖలీల్ అహ్మద్ తెలిపారు. చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని టీడీపీ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.