సింగూర్ ప్రాజెక్టు మూడు గేట్లు మూసివేత

సింగూర్ ప్రాజెక్టు మూడు గేట్లు మూసివేత

SRD: పుల్కల్ మండలం సింగూర్ ప్రాజెక్టులో వరద తగ్గు ముఖం పట్టడంతో మూడు క్రస్ట్ గేట్లు ఇవాళ మధ్యాహ్నం మూసివేసినట్లు ఇరిగేషన్ AEE మహిపాల్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి 20,800 క్యూసెక్కులు ఇన్ ఫ్లో కొనసాగిందని చెప్పారు. అయితే ప్రస్తుతం 9, 11వ గేట్ల ద్వారా రెండు మీటర్ల ఎత్తులో 16,317 క్యూసెక్కులు దిగువకు రిలీజ్ చేసినట్లు ఆయన వెల్లడించారు.