సింగారంలో పారిశుద్ధ్య పనులు ప్రారంభం

సింగారంలో పారిశుద్ధ్య పనులు ప్రారంభం

NRPT: నారాయణపేట మండలం సింగారం గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పంచాయతీ సిబ్బంది వాడల్లో డ్రైనేజీ కాల్వల్లోని చెత్తను తొలగించి శుభ్రం చేశారు. మురుగు కాలువల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సర్పంచ్ నాగిరెడ్డి ప్రజలకు సూచించారు. అధికారులు పాల్గొన్నారు.