నగరం మండలంలో అమరావతి సంబరాలు
BPT: ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత లభిస్తూ పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుని నగరం మండలంలో సంబరాలు మిన్నంటాయి. కూటమి నేతలు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున వేడుకలు జరుపుకున్నారు. ప్రధాన కూడళ్లలో బాణసంచా పేల్చి ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం ఒకరికొకరు మిఠాయిలు పంచుకొన్నారు.