బుచ్చిలో సీపీఎం ఆధ్వర్యంలో ర్యాలీ

బుచ్చిలో సీపీఎం ఆధ్వర్యంలో ర్యాలీ

NLR: బుచ్చిరెడ్డిపాళెం పట్టణంలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో మే డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్ నుండి తాసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. కార్మికులు తమ హక్కుల కోసం రక్తం చిందించి పోరాడి సాధించిన రోజు మే డే అని తెలిపారు. కార్మికులకు నష్టం కలిగించే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.