మంచిర్యాల DCC కార్యదర్శిగా ఆకారపు రమేష్ నియామకం
MNCL: మంచిర్యాల DCC కార్యదర్శిగా మందమర్రి పట్టణానికి చెందిన ఆకారపు రమేష్ నియమితులయ్యారు. NSUI, యూత్ కాంగ్రెస్ విభాగాల్లో ఆయన చేసిన సేవలను గుర్తించి పార్టీ ఈ బాధ్యతలు అప్పగించింది. ఆదివారం రమేశ్ మాట్లాడుతూ.. జిల్లాలో పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. తన నియామకానికి సహకరించిన మంత్రి వివేక్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.