'కూటమి ప్రభుత్వంలో రహదారుల అభివృద్ధి'

కృష్ణా: కూటమి ప్రభుత్వంలో రహదారుల అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే వర్ణ కుమార్ రాజా పేర్కొన్నారు. గురువారం పెదపారుపూడి మండలం వింజనంపాడు గ్రామంలో నూతన సీసీ రహదారిని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ఐదు సంవత్సరాలుగా గ్రామాల్లో రహదారులు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయన్నారు.