ముగిసిన వెంకయ్యనాయుడు పర్యటన..!
KDP: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు 2 రోజుల తన కడప పర్యటనను ముగించుకుని బయలుదేరి వెళ్లారు. జానుమద్ది హనుమచ్ఛాస్త్రీ శత జయంతి వేడుకలలో పాల్గొనేందుకు ఆయన కడపకు వచ్చారు. ఈ మేరకు జిల్లాలోని రాజకీయ పార్టీ నాయకులు పలువురు వ్యక్తులు ఆయనను కలిశారు. ఈ రోజు ఆయన కార్యక్రమాలు ముగిసిన అనంతరం రోడ్డు మార్గాన కడప విమానాశ్రయం చేరుకుని విమానంలో బయలుదేరి వెళ్లారు.