VIDEO: చేపల వలలో చిక్కిన భారీ కొండచిలువ
WGL: వర్ధన్నపేట మండలం కట్య్రాల ఊరు చెరువులో ఇవాళ జాలర్లకు ఊహించని షాక్ తగిలింది. చేపల కోసం వేసిన వలలో భారీ కొండచిలువ చిక్కింది. చేపలు పడ్డాయని వెలికి తీసిన వలలో కొండచిలువ బయటపడడంతో జాలర్లు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గ్రామస్తుల సమాచారంతో స్నేక్ క్యాచర్ కొండచిలవను వల నుంచి బయటికి తీసివదిలి పెట్టారు. కొండచిలువను చూసేందుకు గ్రామస్తులు పోటీపడ్డారు.