వైద్య సిబ్బందిపై దాడి.. నిలిచిన ఓపీ సేవలు

వైద్య సిబ్బందిపై దాడి..  నిలిచిన ఓపీ సేవలు

ADB: బోథ్ సీహెచ్సీ ఆసుపత్రిలో విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. ఆసుపత్రి సూపరిడెంట్ డా.రవి వివరాల ప్రకారం.. నిన్న రాత్రి పురుగుల మందు తాగిన ఓ మహిళను ఆసుపత్రికి తీసుకురాగా.. చికిత్స అనంతరం పరిస్థితి విషమించడంతో ఆదిలాబాద్ రిమ్స్‌కు రెఫర్ చేశారు. ఈ క్రమంలో రిమ్స్‌కు ఎందుకు రెఫర్ చేస్తున్నారని రోగి బంధువులు వైద్య సిబ్బందిపై భౌతిక దాడికి పాల్పడ్డారన్నారు.