బస్సుల కోసం ప్రయాణికుల అవస్థలు

బస్సుల కోసం ప్రయాణికుల అవస్థలు

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి బస్టాండ్‌లో పండుగల సెలవులు ముగియడంతో ప్రయాణికుల రద్దీ పెరిగింది. ఆదివారం రాత్రి వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు వచ్చిన ప్రయాణికులు గంటల తరబడి బస్సుల కోసం నిరీక్షించారు. అధికారులు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులు నడపాలని ప్రయాణికులు డిమాండ్ చేశారు.