బీటీ రోడ్డుకి శంకుస్థాపన చేసిన TDP నాయకులు
ప్రకాశం: హనుమంతునిపాడు మండలం కిష్టంపల్లిలో నూతనంగా మంజూరైన బీటీ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. మండల టీడీపీ అధ్యక్షుడు సానికొమ్ము తిరుపతిరెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ రహదారి నిర్మాణానికి కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి సహకారం అందించినట్లు నాయకులు తెలిపారు. రోడ్డు నిర్మాణంతో గ్రామ ప్రజలకు రాకపోకలు సులభతరం అవుతాయని వారు పేర్కొన్నారు.