'అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి'
ADB: ఉట్నూర్ పట్టణంలోని కేబీ కాంప్లెక్స్‌లో ఉన్న ఏకలవ్య మోడల్ స్కూల్లో సరైన భోజనం పెట్టక విద్యార్థులను ఇబ్బంది పెడుతున్న అధికారులను, సిబ్బందిని సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్వీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు ధరణి రాజేష్ కోరారు. ఉట్నూర్ మాజీ ఎంపీపీ జైవంత్ రావుతో కలిసి ఆయన గురువారం ఐటీడీఏ ఇంఛార్జ్ పీవో యువరాజ్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు.