భీమన్న ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ
NRML: లోకేశ్వరం మండలంలోని పుస్పూర్ గ్రామాభివృద్ధిలో భాగంగా భీమన్న ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే శ్రీ పవార్ రామారావు పటేల్ ఆదివారం ఘనంగా భూమి పూజ నిర్వహించారు. గ్రామస్థుల ఆధ్యాత్మిక విశ్వాసాలను గౌరవిస్తూ, దేవాదాయ శాఖ CGF ద్వారా మంజూరైన రూ. 25 లక్షల నిధులతో ఈ నిర్మాణాన్ని చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.