భీమునిపాదం జలపాతం సందర్శన పునఃప్రారంభం

MHBD: భారీ వర్షాల కారణంగా తాత్కాలికంగా నిలిపివేసిన జిల్లాలోని గూడూరు మండలం భీమునిపాదం జలపాతం సందర్శనను పటిష్టమైన భద్రతా చర్యలతో తిరిగి ప్రారంభించారు. ప్రకృతి ప్రేమికులకు అద్భుతమైన పర్యాటక ప్రదేశమైన ఈ జలపాతాన్ని ఆస్వాదించడానికి సందర్శకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా గడుపుతూ సేద తీరుతున్నారు.