చనిపోయిన అభ్యర్థికి అత్యధిక ఓట్లు

చనిపోయిన అభ్యర్థికి అత్యధిక ఓట్లు

TG: తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. వేములవాడ మండలంలోని చింతల్‌ఠాణా గ్రామంలో ఇటీవల చనిపోయిన అభ్యర్థికి అత్యధిక ఓట్లు పోలయ్యాయి. చెర్ల మురళీ (53) ఐదు రోజుల క్రితం గుండెపోటుతో మృతిచెందారు. దీంతో ఫలితం ప్రకటించడంపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఫలితం ప్రకటించకుండా ఉన్నతాధికారి ఆదేశం కోసం ఆర్వో ఎదురు చూస్తున్నారు.