'త్వరగా కోలుకొని ప్రజా క్షేత్రంలోకి రావాలి'
RR: చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని హైదరాబాద్‌లోని వారి నివాసంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, షాద్ నగర్ బీజేపీ నేత పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకోవడంతో వారితో మాట్లాడి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. భగవంతుడి ఆశీస్సులతో త్వరగా కోలుకొని ప్రజాసేవలోకి రావాలని ఆకాంక్షించారు.