శంషాబాద్‌లో ర్యాగింగ్ కలకలం

శంషాబాద్‌లో ర్యాగింగ్ కలకలం

HYD: శంషాబాద్‌లోని మీటా మైండ్ అకాడమీ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ర్యాగింగ్ ఘటనతో ఉద్రిక్తత నెలకొంది. 2nd ఇయర్ విద్యార్థులు 1st ఇయర్ విద్యార్థులపై ర్యాగింగ్‌కు పాల్పడటంతో ఘర్షణ చెలరేగింది. ఇరువర్గాల విద్యార్థులు పరస్పరం దాడులు చేసుకోవడంతో పలువురు గాయపడ్డారు. హాస్టల్ విద్యార్థులపై డే స్కాలర్ విద్యార్థులు స్థానిక గ్యాంగ్ సహాయంతో దాడి చేసేందుకు ప్రయత్నించారు.