శేష వాహనంపై ఊరేగిన వైకుంఠవాసుడు
GNTR: తెనాలి వైకుంటపురం దేవస్థానంలో కొలువైన శ్రీలక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి గ్రామోత్సవం కన్నుల పండుగగా జరిగింది. విజయదశమి సందర్భంగా గురువారం రాత్రి శేష వాహనంపై కొలువై ఉన్న స్వామి, అమ్మవార్లకు గ్రామోత్సవం నిర్వహించారు. వైకుంటపురం ఆలయం నుంచి ఉత్సవం ప్రారంభమై పట్టణ వీధుల గుండా సాగింది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.