కాంగ్రెస్‌లో చేరిన కార్మిక సంఘం నాయకులు

కాంగ్రెస్‌లో చేరిన కార్మిక సంఘం నాయకులు

BDK: మణుగూరు ఏరియాలోని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘాన్ని వీడిన నాయకులు బుధవారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్య నాయకులు ప్రభాకర్రావుతోపాటు సుమారు 50 మందికి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఖమ్మంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఐఎన్టీయూసీ నాయకులు పాల్గొన్నారు.