మూడవ విడత: తొలి రోజు 81 నామినేషన్లు
MBNR: స్థానిక ఎన్నికలలో భాగంగా మూడో విడత 1వ రోజు 81 నామినేషన్లు వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. అడ్డాకుల మండలంలోని 17 గ్రామాల నుండి 6 నామినేషన్లు, బాలనగర్ మండలంలోని 37 గ్రామాల నుండి 22 నామినేషన్లు, భూత్పూర్ మండలంలోని 19 గ్రామాల నుండి 17 నామినేషన్లు, జడ్చర్ల మండలంలోని 45 గ్రామాల నుండి 25 నామినేషన్లు, మూసాపేట నుండి 11 నామినేషన్లు వచ్చాయన్నారు.