'ధర్మపురి ఆలయాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తాం'
TG: జగిత్యాల జిల్లాకు చెందిన ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. గోదావరి పుష్కరాలకు కూడా సంపూర్ణ ఏర్పాట్లు చేయాలని సూచించారు. వందలాది సంవత్సరాలు చరిత్ర ఉన్న ధర్మపురి ఆలయ అభివృద్ధి పనులు ఆగమశాస్త్రం, వేద పండితులు, భక్తులకు అనుగుణంగా పునర్నిర్మాణ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.