పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే
SKLM: పోలాకి మండలం కుసుమపోలవలలో ఉన్న ప్రాథమిక పాఠశాలను ఎమ్మెల్యే రమణమూర్తి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు చదువు గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఉపాధ్యాయులు విద్యార్థులకు సరైన బోధన అందించాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు.