తల్లిదండ్రులు లేని పిల్లలకు అండ: కలెక్టర్

PDPL: తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు జిల్లా యంత్రాంగం అండగా ఉంటుందని కలెక్టర్ కోయ శ్రీహర్ష భరోసా ఇచ్చారు. పెద్దపల్లి కలెక్టరేట్‌లో సమావేశ మందిరంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు, వారి సంరక్షకులతో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. పిల్లలు చదువుల్లో ముందుండాలని, ఏదైనా సమస్య ఉంటే 1098 ఫోన్ చేయాలన్నారు.