మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిలర్ మెంబర్‌గా సత్తిబాబు

ELR: చింతలపూడి నగర పంచాయతీ మునిసిపల్ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్‌గా మన్యం సత్య కుమార్(సత్తిబాబు )ని మంగళవారం ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ నియమించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యేని మన్యం సత్య కుమార్, పట్టణ తెలుగుదేశం నాయకులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు.