ఆదాయ లక్ష్యాల అధిగమణపై కలెక్టర్ దృష్టి
నంద్యాల జిల్లాలో ప్రధాన ఆదాయ వనరులపై ప్రత్యేక దృష్టి సారించి వార్షిక లక్ష్యాలను అధిగమించాలని కలెక్టర్ జీ. రాజకుమారి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గత ఆర్థిక సంవత్సరాన్ని మించి లక్ష్యాలు సాధించేలా సమిష్టిగా కృషి చేయాలని స్పష్టం చేశారు.