త్రిసభ్య కమిటీ ఛైర్మన్‌గా నూతలపాటి

త్రిసభ్య కమిటీ ఛైర్మన్‌గా నూతలపాటి

NTR: విజయవాడ రూరల్ మండలంలోని గొల్లపూడి పీ.ఏ.సీ.ఎస్ త్రిసభ్య కమిటీ ఛైర్మన్‌గా నూతలపాటి శ్రీనివాసరావు నియమించబడ్డారు. గొల్లపూడిలోని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు ఎమ్మెల్యే శాలువా కప్పి ఘనంగా సత్కరించి అభినందించారు. శుభాకాంక్షలు తెలిపారు. కూటమి ప్రభుత్వ లక్ష్యాల మేరకు రైతులకు విశేష సేవలందించాలని ఎమ్మెల్యే సూచించారు.