21 నుంచి సీపీఐ వ్యవస్థాపక వార్షికోత్సవాలు

సీపీఐ (మావోయిస్టు) పార్టీ స్థాపనకు 21 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల 21 నుంచి 27 వరకు దేశవ్యాప్తంగా వార్షికోత్సవాలను విప్లవ స్పూర్తితో నిర్వహించాలని కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది. శత్రువు కొనసాగిస్తున్న ఆపరేషన్ 'కగార్'ను తిప్పికొట్టి, పార్టీ, పీఎల్‌జీఏ (ప్రజా విముక్తి గెరిల్లా ఆర్మీ), ప్రజాసంఘాలను కాపాడుకోవాలని ఆ కమిటీ తమ సందేశంలో పేర్కొంది.