'సీపీఐ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి'

ATP: సీపీఐ 28వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు నాగార్జున పిలుపునిచ్చారు. రాయదుర్గం పట్టణంలోని కార్యాలయంలో సీపీఐ నాయకులతో కలిసి నాగార్జున మీడియాతో మాట్లాడారు. ఈనెల 20వ తేదీ నుంచి ఒంగోలులో నిర్వహించనున్న రాష్ట్ర మహాసభలకు రైతన్నలు, ప్రజలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.